• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టీల్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

    హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌పై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా వీఎస్‌టీ వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్‌ని నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన కేటీఆర్‌.. ఈ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. కాగా, దేశంలోనే మెట్రోకి పైన నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌గా ఇది రికార్డు కెక్కింది. GHMC పరిధిలో భూసేకరణ లేకుండా నిర్మించిన తొలి బ్రిడ్జిగానూ ఇది ఘనత సాధించింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) … Read more

    KTR BIRTHDAY: టమాటాలు పంపిణీ చేసిన లీడర్

    మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను వరంగల్‌లో బీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి వెరైటీగా నిర్వహించాడు. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో వాటిని పేదలకు ఉచితంగా పంచాడు. దాదాపు 200 మంది పేదలకు గులాబీ రంగు బుట్టలో టమాటాలు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇంతకుముందు కూడా శ్రీహరి బీఆర్ఎస్ అవిర్భావ వేడుకల్లో లిక్కర్, చికెన్ పంపిణీ చేసి వార్తల్లో నిలిచాడు. BRS leader Rajanala Srihari, who earlier distributed liquor and chicken to mark party's entry … Read more

    Then-Now: తెలంగాణ రాకముందు అలా.. వచ్చాక ఇలా.. ఎంత మార్పో మీరే చూడండి..!

    ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. … Read more

    మనవడి గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్‌

    TG: కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వేడుకలో హిమన్షు 12వ తరగతి పట్టా అందుకున్నారు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు లభించింది. గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన అనంతరం హిమాన్షు కేసీఆర్‌ వద్దకు వెళ్లారు. పట్టాను కేసీఆర్ చేతిలో పెట్టి పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ భార్య, కేటీఆర్‌ దంపతులు కూడా పాల్గొన్నారు. 12వ తరగతి విజయవంతంగా పూర్తి చేసిన వారికి … Read more

    బీజేపీలో మున్నాబాయ్ ఎంబీబీఎస్‌లు: కేటీఆర్

    TS: మోదీ విద్యార్హతపై కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పు అనంతరం కేటీఆర్ [ట్వీట్](url) చేశారు. చూస్తుంటే బీజేపీలో చాలామంది మున్నాబాయ్ ఎంబీబీఎస్‌లు ఉన్నట్లు ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి కూడా ఇద్దరు ఎంపీలకు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఒకరు తమిళనాడు, మరొకరు రాజస్థాన్ యూనివర్సిటీల నుంచి పట్టా పొందారని విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఇలా తప్పుడు విద్యార్హతను చూపించడం నేరం కాదా? దోషులుగా తేలితే లోక్‌సభ స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటిస్తారా? అంటూ ప్రశ్నించారు. Looks like we have … Read more

    హైదరాబాద్‌లో మరిన్ని ప్లైఓర్లు నిర్మిస్తాం: కేటీఆర్

    హైదరాబాద్‌లో మెట్రోలైన్‌ను భవిష్యత్తులో హయత్ నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే మెట్రో లైన్‌ను ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. SRDPలో భాగంగా రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్‌ RHS ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్లైఓవర్లు నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

    ఇద్దరే నిందితులని కేటీఆర్‌ ఎలా చెప్తారు: రేవంత్

    TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సిట్ చెప్పకుండానే ఇద్దరు నిందితులని కేటీఆర్ ఎలా చెప్తారని మండిపడ్డారు. 9 మందిని అరెస్ట్ చేస్తే ఇద్దరే నిందితులు ఎలా అవుతారని ప్రశ్నించారు. కేసును కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. BRS విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అందుకే ఎగ్జామ్స్ రద్దు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతినోటిఫికేషన్‌ గందరగోళమేనని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పేపర్ లీకేజీపై కేటీఆర్ ప్రెస్‌మీట్

    LIVE: పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌కి నివేదిక అందించామని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమమైన కమిషన్లలో టీఎస్‌పీఎస్సీ ఒకటని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్, 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్లు టీఎస్‌పీఎస్సీని సందర్శించారని వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో అత్యధిక నియామకాలు జరిపిన కమిషన్ టీఎస్‌పీఎస్సీ అని కొనియాడారు.

    దుమారం రేపిన పేపర్ లీక్ ఘటన

    TS: TSPSC పేపర్ల లీక్ ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది. వివిధ పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీగ్ ఘటనపై బీజేపీ, బీఎస్పీ పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని, మంత్రి కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలని … Read more

    2022 తెలంగాణ, హైదరాబాద్ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.  ఆదిలోనే ఆటంకం ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి … Read more