భారత్‌లో క్రికెట్‌కు ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఇక్కడి వారు ఎంతగానో అభిమానిస్తారు. భారత ఆటగాళ్లు సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే ఆకాశానికి ఎత్తేస్తారు. సోషల్‌మీడియాలో వారిని హీరోలుగా ప్రొజెక్టు చేస్తారు. అంతటి క్రేజ్ ఉన్న టీమ్‌ఇండియా క్రికెటర్లను ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) ఓ ఆట ఆడుకుంది. వారికి వయసైపోతే ఎలా ఉంటారో ఫొటోల రూపంలో చూపించింది. ఈ ఫొటోలను చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్స్ వయసైపోతే ఇంత దారుణంగా ఉంటారా? అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు ఏవో మీరు చూసేయండి.
ఎం.స్. ధోని
ఎం.ఎస్ ధోనిని క్రికెట్ అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. 41 ఏళ్ల వయసులోనూ ధోని ఎంతో ఫిట్‌గా ఉంటూ ఐపీఎల్‌లో అలరిస్తున్నాడు. అటువంటి ధోని వయసు మళ్లితే ఎలా ఉంటాడో AI కళ్లకు కట్టింది. ముడతలతో ఉన్న ధోని ఫొటోను చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమ ధోని ముసలివాడైతే మరీ ఇంత దారుణంగా ఉండడని సమర్థించుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీని యూత్ ఐకాన్‌గా చెప్పుకుంటారు. కింగ్ కోహ్లీ మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. అతడి ఫిట్‌నెస్ కూడా అమోఘంగా ఉంటుంది. అటువంటి కోహ్లీ వృద్దుడిగా మారితే ఎలా ఉంటాడో AI చూపించింది. నెరిసిన జుట్టు, గడ్డంతో ఉన్న కోహ్లీని చూపించింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు రిటైర్ లెక్చరర్‌లా కోహ్లీ ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సచిన్ టెండూల్కర్
క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ 50 ఏళ్ల వయసులోనూ ఇంకా యువకుడిలానే కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబయికి మెంటార్‌గా కనిపించి యంగ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. అటువంటి సచిన్‌ను కూడా AI తన మార్ఫింగ్ మాయతో ముసలివాడ్ని చేసింది. ఓల్డేజ్ లుక్‌లో ఉన్న సచిన్‌ను చూస్తుంటే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా గుర్తుకు వస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కే.ఎల్ రాహుల్
యంగ్ క్రికెటర్ కే.ఎల్ రాహుల్ ఐపీఎల్‌లో గాయపడి ఈ సీజన్‌తో పాటు WTC ఫైనల్స్‌కు దూరమయ్యాడు. దీంతో రాహుల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. దీంతో వారిలో ఉత్సాహం నింపేందుకు AI యత్నించింది. రాహుల్ కూడా వయసైపోతే ఎలా ఉంటాడో ఫన్నీగా చేసి చూపించింది.
రోహిత్ శర్మ
టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా AI తన మాయలో పడేసింది. ఓల్డ్ మ్యాన్‌గా మార్చివేసింది. ముడతలు పడిన ముఖంతో ఉన్న రోహిత్‌ను గుర్తు పట్టడం కాస్త కష్టమే. ఈ ఫొటోపై హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.
శిఖర్ ధావన్
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో సత్తా చాటాడు. పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన ధావన్ బ్యాటుతోనూ రాణించాడు. అయితే శిఖర్ ధావన్‌ను సైతం AI విడిచిపెట్టలేదు. ధావన్ ముసలివాడైతే ఎలా ఉంటాడో మీరే చూడండి.
జస్ప్రిత్ బుమ్రా
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పి గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన బుమ్రా ఓల్డ్ అయిపోతే ఎలా ఉంటాడో ఓ లుక్ వేయండి.
హార్దిక్ పాండ్యా
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో హార్దిక్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌గా నిలిచింది. అయితే హార్దిక్‌ను కూడా AI ముసలి వ్యక్తిగా మార్చేసింది. హార్దిక్‌ను ఇలా లుక్‌లో గుర్తుపట్టడం కష్టమే.
ఛతేశ్వర్ పుజారా
నయా వాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఛతేశ్వర్ పుజారా టెస్టుల్లో రాహుల్ ద్రావిడ్‌ను గుర్తుచేస్తున్నాడు. పుజారాను కూడా AI ఓల్డ్‌మ్యాన్‌ను చేసేసింది. ఈ లుక్‌లో పుజారా రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు.
రవీంద్ర జడేజా
ఆల్‌రౌండర్ జడేజా ఫిట్‌నెస్‌కు మారుపేరులా ఉంటాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ చేస్తుంటాడు. గడ్డం, మీసంతో ఉన్న లుక్‌లో జడేజా శాస్త్రవేత్తను గుర్తుకుతెస్తున్నాడు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?