• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?

    ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్‌ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్‌ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్‌ టాక్‌ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా చిత్రాలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అటువంటి చిత్రాలు ఏవి? ఇందుకు గల కారణాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    భోళాశంకర్‌ (Bhola Shankar)

    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మేహర్‌ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన రీసెంట్‌ చిత్రం ‘భోళాశంకర్‌’. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందే నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మేహర్‌ రమేష్‌.. గతంలో ఇచ్చిన డిజాస్టర్ల నేపథ్యంలో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందుకు అనుగుణంగానే రిలీజ్‌ తర్వాత ‘భోళాశంకర్‌’ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడం గమనార్హం. 

    ఆదిపురుష్‌ (Aadi Purush)

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా విడుదలకు ముందే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైనప్పటి నుంచి నెట్టింట విపరీతంగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. గ్రాఫిక్స్ మరి అద్వాన్నంగా ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే విడుదల తర్వాత ‘ఆదిపురుష్‌’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాషణలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

    షాడో (Shadow)

    వెంకటేష్‌ (Venkatesh) హీరోగా మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘షాడో’. మేహర్‌ రమేష్‌ గత చిత్రాలు ‘కంత్రి’, ‘శక్తి’ డిజాస్టర్‌గా నిలవడంతో దాని ప్రభావం ‘షాడో’పై కూడా పడింది. ఈ మూవీ ట్రైలర్‌.. అంచనాలను అందుకోకపోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్‌ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. లాంగ్‌ హెయిర్‌లో వెంకీ లుక్‌ బాలేదని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మెుత్తానికి విడుదల తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ నిలిచి ఆ విమర్శలను నిజం చేసింది. 

    స్కంద (Skanda)

    హీరో రామ్‌ (Ram), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన ‘స్కంద’పై ట్రైలర్‌ రిలీజ్‌ ముందు వరకూ భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ రిలీజ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాక్షన్‌ సీన్స్‌ మరి ఓవర్‌ డోస్‌ అయినట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ‘స్కంద’ రిలీజ్‌ తర్వాత బి లో యావరేజ్‌గా నిలిచింది. ముఖ్యంగా రామ్‌కు నటుడు శ్రీకాంత్‌ ఎలివేషన్‌ ఇచ్చే డైలాగ్‌ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రోల్‌ కావడం గమనార్హం.

    వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama)

    రామ్‌చరణ్‌ హీరోగా (Tollywood Films Got Flop Talk Before The Release) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తొలి ఆట నుంచే ట్రోల్స్‌ చుట్టుముట్టాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ విలన్ సోదరుడి తల నరకడం.. గద్ద దాన్ని ఎత్తుకెళ్లడానికి సంబంధించిన సీన్‌ విపరీతంగా ట్రోల్‌కు గురైంది. అలాగే రైలు పై నుంచి పరిగెత్తుకుంటూ రామ్‌చరణ్‌ బిహార్‌ వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చరణ్‌ ఫ్లాప్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. 

    లైగర్‌ (Liger)

    విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్‌ అయ్యింది. ప్రమోషన్స్‌ సందర్భంగా నిర్మాత చార్మీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. పైగా సిక్స్‌ ప్యాక్‌తో ఎంతో దృఢంగా ఉన్న విజయ్‌కు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించడం కూడా ట్రోల్స్‌కు కారణమైంది.

    రాధే శ్యామ్‌ (Radheshyam) 

    బాహుబలి తర్వాత ప్రభాస్‌ తీసిన రెండో చిత్రం ‘రాధేశ్యామ్‌’. సాహో ఫ్లాప్‌ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 1976 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇందులో ప్రభాస్‌ హస్తసాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు సోషల్‌ మీడియాలో ఈ సినిమా కూడా డౌటే అంటూ ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకొని.. ఆ రూమర్స్‌ను నిజం చేసింది. 

    వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover)

    విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌‘ చిత్రం టీజర్‌ రిలీజ్‌ నుంచే విమర్శలను మూటగట్టుకుంది. టీజర్‌ బోల్డ్‌గా ఉండటంతో పాటు విజయ్‌ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయడం చూపించారు. అర్జున్‌ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌ ఎక్కువైందని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు మహిళ సంఘాలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించాయి. ఇన్ని ట్రోల్స్‌, విమర్శల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది. 

    సన్‌ ఆఫ్‌ ఇండియా (Son of India)

    మంచు మోహన్‌బాబు (Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Tollywood Films Got Flop Talk Before The Release) చిత్రం విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ మీమ్స్‌ క్రియేట్‌ చేశాయి. మరో ఫ్లాప్‌ లోడింగ్‌ అంటూ ట్రోల్స్‌ చేశాయి. ఈ పరిణామాల మధ్య వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv