తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను తొలగిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వ్యూహాత్మ ఎత్తులకు బీజేపీ సమాయత్తం అయింది. తొలుత ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా తనను తొలగిస్తున్న నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు స్వయంగా ఫోన్ చేసి వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. త్వరలో తనకు కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు అధిష్ఠానం నుంచి హామీ లభించిందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
ఆ వ్యాఖ్యలే సోము వీర్రాజు కొంప ముంచాయి
ఇటీవల బీజేపీ లీగల్ సెల్ సమావేశంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలే ఆయనకు నష్టం తెచ్చిపెట్టాయని తెలుస్తోంది. తాను బీజేపీలో కాకుండా వేరే పార్టీలో ఉంటే గెలిచేవాడినని ఆయన వ్యాఖ్యానించడంపై అధిష్ఠానం సీరియన్ అయింది. గతంలోనూ సోము వీర్రాజు తీరుపై ఏపీ బీజేపీ నేతల నుంచి అధిష్ఠానానికి ఫిర్యాదులు అందాయి. ఇతర పార్టీలతో పోలిస్తే.. వైసీపీ పాలనపై సరైన రీతిలో విమర్శల అవడం కూడా ఆయన పీటం కిందకు నీళ్లు తెచ్చాయి. వీటన్నింటిని క్రోడికరించిన అధిష్ఠానం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపేందుకు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని ఎంచుకుంది.
పురంధేశ్వరినే ఎందుకు?
ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు పదవి తొలగింపుపై సంకేతాలు అందినా… పురంధేశ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించడం రాజకీయవర్గాల్లో ఎవరూ ఊహించనిది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనుంగు శిష్యుడు సత్యంబాబు తొలుత రేస్‌లో ముందున్నప్పటికీ.. ఆయనపై టీడీపీ ముద్ర ఉండటంతో అధిష్ఠానం న్యూట్రల్ పర్సనాల్టిపై సెర్చ్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ వైరం, రాజకీయ వైరం ఉన్న పురంధేశ్వరినే బీజేపీ అధిష్టానం ఎంచుకుంది. దివంగత సీఎం ఎన్టీఆర్ వారసత్వం కలిగి ఉండటం కూడా పురంధేశ్వరికి ఫ్లస్ అయింది. ఒకవేళ టీడీపీతో పొత్తులేని పక్షంలో- జనసేనతో బరిలోకి దిగి ఎన్టీఆర్ అభిమానులను తనవైపునకు తిప్పుకోవడానికి పురంధేశ్వరి ఉపయోగపడుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనగా ఉన్నట్లు సమాచారం.
జూ. ఎన్టీఆర్‌ను దువ్వే పనిలో..
టీడీపీ కార్యక్రమాలకు, చంద్రబాబు నాయుడుకు దూరంగా ఉన్న జూ. ఎన్టీఆర్‌ను తమవైపు తిప్పుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తాజా పరిణామాల బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో ఎన్టీఆర్ అసలైన వారసుడిగా అభిమానుల్లో జూ.ఎన్టీఆర్‌పై ఓ విధమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఉందనడంలో సందేహం లేదు. దీనిని ఎన్‌క్యాష్ చేసుకునేందుకే.. పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు అప్పగించినట్లు సమాచారం. RRR సినిమా సందర్భంగా.. స్వయంగా జూ. ఎన్టీఆర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి సన్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూ. ఎన్టీఆర్‌కు మేనత్త అయిన పురంధేశ్వరి ద్వారా బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఎన్నికల నాటికి తారక్‌ను పార్టీ సానుభూతి పరుడిగా మార్చి తద్వారా వచ్చే ఎన్నికల్లో గణనీయంగా లబ్ధిపొందాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
ప్రస్తుతం దగ్గుబాటి పురంధేశ్వరి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆమె కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు.
తెలంగాణలోనూ మార్పులు
మరోవైపు అనుకున్నట్లుగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆ పదవీ నుంచి తొలగిస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. టీబీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని నియమిస్తూ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. ఢిల్లీలో బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం సంజయ్ తన రాజీనామ సమర్పించారు. కాగా బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వవచ్చనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అటు తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధిష్ఠానం నియమించింది. ఈటల కోరుకున్నట్లుగానే ప్రచార కమిటీ అప్పగించారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!