• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!

    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    హనుమాన్‌ (HanuMan)

    తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

    ఫైటర్‌ (Fighter)

    హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం ‘ఫైటర్‌’.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

    మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys)

    మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది. 

    షైతాన్‌ (Shaitaan)

    బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం ‘షైతాన్‌‘ ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది. 

    గుంటూరు కారం (Guntur Kaaram)

    మహేశ్‌ బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం‘.. ప్రస్తుత జాబితాలో టాప్‌ – 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.

    ది గోట్‌ లైఫ్‌ (The Goat Life)

    మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన ‘ది గోట్‌ లైఫ్‌‘.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ – 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. 

    క్రూ (Crew)

    టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ‘క్రూ’ (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. 

    ఆవేశం (Aavesham)

    ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.

    ప్రేమలు (Premalu)

    మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు.

    టిల్లు స్క్వేర్‌ (Tillu Square)

    సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv