సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ పవర్‌ఫుల్ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బాహుబలి (Baahubali)
బాహుబలిలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్ చాలా అద్భుతంగా చేశాడు.
శివ (Siva)
హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్ చైన్ తెంపే సీన్ ఇప్పటికీ చాలా ఫేమస్.
ఆర్ఆర్‌ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్‌చరణ్(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.
సలార్ (Salaar)
ఇందులో హీరో ప్రభాస్ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్ ఫైట్, కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ దుమ్మురేపాడు.
యానిమల్ (Animal)
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్ రీవెంజ్ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.
సింహాద్రి (Simhadri)
ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్ సీన్ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్ విజిల్స్ వేయిస్తాయి.
విక్రమార్కుడు (Vikramarkudu)
స్టార్ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్ సీన్ మాత్రం నెవర్ బీఫోర్ అన్నట్లుగా ఉంటుంది.
కర్తవ్యం (Karthavyam)
టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti) చేసిన రోల్ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.
అంకుశం (Ankusam)
హీరో రాజశేఖర్ సూపర్ హిట్ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.
గ్యాంగ్ లీడర్ (Gang Leader)
మెగాస్టార్ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్ అయ్యింది.
అర్జున్ రెడ్డి (Arjun Reddy)
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
టాలీవుడ్‌లోని క్లాసిక్ హీరోగా ‘రామ్ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్ తొలిసారి సిక్స్ ప్యాక్ చేయడం విశేషం.
పోకిరి (Pokiri)
ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.