• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!

    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్‌ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్‌ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం. 

    నాని.. డబుల్‌ ధమాకా!

    69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్‌ నాన్న) నాని నామినేట్‌ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), ధనుష్‌ (సర్), నవీన్‌ పోలిశెట్టి (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌ రాజ్‌ (రంగమార్తాండ), ఆనంద్‌ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్‌ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్‌ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది. 

    బేబీ చిత్రం హవా!

    69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్‌ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్‌ (సాయి రాజేష్‌), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌ (విజయ్‌ బుల్గానిన్‌), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

    ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే…

    ఉత్తమ చిత్రం

    • బేబీ
    • బలగం
    • దసరా
    • హాయ్‌ నాన్న
    • మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి
    • సామజవరగమన
    • సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌

    ఉత్తమ నటుడు

    • ఆనంద్‌ దేవరకొండ (బేబీ)
    • బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)
    • చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)
    • ధనుష్‌ (సర్‌)
    • నాని (దసరా)
    • నాని (హాయ్‌ నాన్న)
    • నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)
    • ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)

    ఉత్తమ నటి:

    • అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)
    • కీర్తిసురేశ్‌ (దసరా)
    • మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)
    • సమంత (శాకుంతలం)
    • వైష్ణవీ చైతన్య (బేబీ)

    ఉత్తమ దర్శకుడు:

    • అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)
    • కార్తిక్‌ దండు (విరూపాక్ష)
    • ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
    • సాయి రాజేశ్‌ (బేబీ)
    • శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)
    • శ్రీకాంత్‌ ఓదెల (దసరా)
    • వేణు యెల్దండ (బలగం)

    ఉత్తమ సహాయ నటుడు:

    • బ్రహ్మానందం (రంగ మార్తండ)
    • దీక్షిత్‌శెట్టి (దసరా)
    • కోట జయరాం (బలగం)
    • నరేశ్‌ (సామజవరగమన)
    • రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)
    • విష్ణు ఓఐ (కీడా కోలా)

    ఉత్తమ సహాయ నటి:

    • రమ్యకృష్ణ (రంగమార్తండ)
    • రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)
    • రుపా లక్ష్మీ (బలగం)
    • శ్యామల (విరూపాక్ష)
    • శ్రీలీల (భగవంత్‌ కేసరి)
    • శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
    • శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు)

    ఉత్తమ గాయని:

    • చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)
    • చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)
    • దీ (చమ్కీల అంగీలేసి -దసరా)
    • మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)
    • శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)
    • శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌)

    ఉత్తమ గాయకుడు:

    • అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)
    • హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)
    • పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)
    • రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)
    • సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)
    • శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)

    ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌:

    • బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)
    • బలగం (భీమ్స్‌ సిసిరిలియో)
    • దసరా (సంతోష్‌ నారాయణ్‌)
    • హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
    • ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
    • వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)

    ఉత్తమ సాహిత్యం:

    • అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)
    • అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
    • కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)
    • కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)
    • పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv