టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. మరెన్నో యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను అలరించారు. హర్రర్, కామెడీ, రొమాంటిక్ వంటి జోనర్లలో వచ్చిన మూవీలు సైతం వెండితెరను పలకరించాయి. అయితే రొటీన్ కథలతో విసిగిపోయిన టాలీవుడ్‌కు కొన్ని సినిమాలు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. హీరోకు లోపం ఉన్న కథతో వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కొత్తగా ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తాయని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? లోపంతో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఇప్పుడు చూద్దాం.
పుష్ప
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లుఅర్జున్ ఒక లోపంతో కనిపిస్తాడు. అతడి కుడి భుజం సహజంగా కంటే మరీ పైకి ఉంటుంది. సినిమా అంతా బన్నీ అలాగే ఉంటాడు. భుజాన్ని అలాగే పైకి పెట్టి షూటింగ్‌లో పాల్గొనటం ఎంతో కష్టంగా అనిపించిందని ఓ సందర్భంలో బన్నీ చెప్పుకొచ్చాడు.
రంగస్థలం
రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఎదుటి వ్యక్తి పెదాల కదలికలను బట్టి మాటలను ఆర్థం చేసుకుంటాడు. క్లైమాక్స్‌లో ఆ చెవిటి తనమే చెర్రీకి సమస్యగా మారుతుంది. తనను ఎవరూ చంపారో అన్న చెప్పినప్పటికీ అది బుచ్చిబాబు చెవికి ఎక్కదు. చివరకు విలన్ ప్రకాష్‌రాజ్ అని తెలుసుకొని చంపేయడంతో కథ సుఖాంతమవుతుంది.
రాజా ది గ్రేట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా టాలీవుడ్ భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో రవితేజకు కళ్లు కనిపించవు. బ్లైండ్‌గా ఉంటూ రవితేజ చేసిన కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా అనిల్ రావిపూడిని నిలదొక్కుకునేలా చేసింది.
సూర్య vs సూర్య
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ‘సూర్య vs సూర్య’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ జన్యుపరమైన లోపంతో బాధపడుతుంటాడు. అతడి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో పగటివేళ బయటకు వెళ్తే 15 నిమిషాల్లో చనిపోతాడని వైద్యులు చెబుతారు. దీంతో రాత్రివేళ మాత్రమే హీరో బయటకు వస్తుంటాడు. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
భలే భలే మగాడివోయ్
హీరో నాని, డైరెక్టర్ మారుతీ కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నాని మతిమరుపుతో బాధపడుతుంటాడు. ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోతూ నవ్వులు పూయించాడు. అయితే అతడికున్న ఆ సమస్య కొన్ని చిక్కులను సైతం తెచ్చిపెడుతుంది. హీరోయిన్‌తో తన ప్రేమకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది.
సవ్యసాచి
నాగచైతన్య హీరోగా చేసిన ‘సవ్యసాచి’ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలకు పూర్తి భిన్నం. ఇందులో హీరో ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే లోపంతో బాధపడుతుంటాడు. అవిభక్త కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు ఒకరిగా కలిసిపోవడమే ఈ సమస్యకు కారణం. ఇందులో నాగచైతన్య మెదడు, ఎడమ చేయి కవల సోదరుడి ఆధీనంలో ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించనప్పటికీ ఒక మంచి సినిమాగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.
నా పేరు సూర్య
అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన చిత్రం ‘నా పేరు సూర్య‘. ఇందులో బన్నీ సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో బన్నీకి విపరీతమైన కోపం ఉంటుంది. దాంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సైన్యం నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. ఇందులో అల్లుఅర్జున్ అగ్రెసివ్ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!